రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాటరాని మౌనమిది’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నీషియషన్స్ అందరూ కలిసి ‘మాటరాని మౌనమిది’ ఫస్ట్ కాపీని హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో వీక్షించారు. ఈ చిత్రం చుసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా హిట్ అవుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీలో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని కొనియాడారు. హీరో, హీరోయిన్లుగా నటించిన నూతన నటీనటులందరూ దర్శకుడిని కొనియాడారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ఇది తన రెండో సినిమా అని. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందన్నారు. తమ టీం అందరం కలిసి సినిమాను వీక్షించామని తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. తమ టీం అంతా చాలా నమ్మకంగా ఉందని పేర్కొన్నారు. మాటరాని మౌనమిది సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలియజేశారు.
రుద్ర పిక్చర్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ మూవీలో మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి నటించారు. శివరామ్ చరణ్ కెమెరామేన్‌గా పనిచేయగా.. అషీర్ లుక్ సంగీతం సమకూర్చాడు. శివ సర్వాణి ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వం సుకు పూర్వాజ్ అందించారు.