Breaking : సినీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి తలసాని..

0
1076

ప్రతి మూడు సంవత్సరాలకోసారి పెంచాల్సిన వేతనాలను ఐదు సంవత్సరాలవుతున్నా పెంచలేదని తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నేపథ్యంలో నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిరసన చేపట్టారు. కార్మికులు సమ్మెపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందిస్తూ.. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలని, కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదన్న ఆయన.. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నరేంద్రమోడీ రోజు ప్రపంచం గురించి నీతులు చెబుతారని, ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ట పోతుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని, దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని ఆయన మండిపడ్డారు.

తలెత్తుకుని గర్వంగా నిలబడలేకపోతుందని, ఎలక్టేడ్ గవర్నమెంట్లు ఉండటం ఓర్వలేక పోతున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, మోడీ, షా దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు తలసాని శ్రీనివాస్‌ . మధ్యప్రదేశ్ లో అలానే జరిగిందని, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందన్నారు తలసాని శ్రీనివాస్‌ . అధికారం శాశ్వతం కాదు… బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదన్నారు. మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని, ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని తలసాని శ్రీనివాస్‌ హితవు పలికారు. హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని, బీజేపీ ముఖ్యమంత్రులు చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు తలసాని శ్రీనివాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here