‘పంచతంత్ర కథలు’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన కీరవాణి

0
178

ఐదు వేర్వేరు క‌థ‌లతో ఆంథాల‌జీ మూవీగా తెర‌కెక్కుతోన్న చిత్రం `పంచ‌తంత్ర క‌థ‌లు`. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతు న్నారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్కర్‌, ప్రణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వర్ ముఖ్య పాత్రల‌లో న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన `మోతెవ‌రి` సాంగ్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో చార్ట్ బ‌స్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్రముఖ సంగీత ద‌ర్శకుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ.. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శక‌త్వంలో మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ అనే ఈ ఆంథాల‌జీ ఐదు వేరు వేరు క‌థ‌లు.. వేరు వేరు జోన‌ర్లలో రావ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. ట్రైల‌ర్ చాలా బాగుందని ప్రశంసించారు. ఈ మూవీలోని క్యారెక్టరైజేష‌న్స్ అన్నీ కొత్త కొత్తగా అనిపించాయన్నారు. అన్నింటినీ మించి తమ ఫ్యామిలీ మెంబ‌ర్ నోయెల్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడని.. అందుకే ఈ సినిమా కోసం చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాని కీరవాణి పేర్కొన్నారు. కాగా ఈ సినిమా ఇటీవ‌ల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ ఎ స‌ర్టిఫికెట్ పొందింది. సెన్సార్ స‌భ్యులు ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. అతి త్వర‌లో ఈ చిత్రం విడుద‌ల‌ తేదీని ప్రక‌టించ‌నున్నారు.

పంచతంత్ర కథలు సినిమాను మ‌ధు క్రియేష‌న్స్‌ బ్యానర్‌పై డి.మధు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా కమ్రాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. కో ప్రొడ్యూస‌ర్‌గా డి. ర‌వీంద‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా పాల‌కూరి సాయికుమార్‌ వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here