ఈమధ్య పవిత్రా లోకేష్, నరేష్ పేరు నిత్యం వార్తల్లో నానుతోన్న సంగతి తెలిసిందే! ఎప్పుడైతో బెంగళూరు మీడియా వీళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారని కోడై కూసిందో, అప్పట్నుంచి వీరి గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. తాము కేవలం స్నేహితులమేనని, అంతకుమించి ఏమీ లేదని ఎంత చెప్తోన్నా.. మీడియా మాత్రం వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని వార్తలు ప్రసారం చేస్తూనే ఉంది. దీంతో విసుగెత్తిపోయిన పవిత్రా లోకేష్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
కొందరు మీడియా ప్రతినిధులు తనని వెంబడిస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలు రాస్తున్నారని, తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని పవిత్రా లోకేష్ మైసూలురులోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందే పవిత్రా.. తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, తన పరువుకు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసి షాకిచ్చింది.
మరోవైపు.. నరేష్‌తో ఎఫైర్ నడుపుతోందని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి చేస్తోన్న ఆరోపణల్ని పవిత్రా లోకేష్ ఖండించింది. తనను బ్యాడ్ చేయడానికే ఆమె కన్నడ మీడియాకెక్కిందని, ఓ ఛానెల్‌తో చేతులు కలిపి తనని బ్లాక్‌మెయిల్ కూడా చేస్తోందని ఆరోపణలు చేసింది. రమ్య చెప్తోన్న మాటల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇలాగే చేసిందని, ఇప్పుడు బెంగళూరుకి మకాం మార్చి తనని టార్గెట్ చేస్తోందని పవిత్రా చెప్పుకొచ్చింది.