Prabhas: హాలీవుడ్ రేంజ్ కథని కాదని.. చక్రం తిప్పేసిన ప్రభాస్

0
153

హాలీవుడ్ సినిమా ‘మ్యాడ్‌మ్యాక్స్’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మొదట్నుంచి చివరివరకు పోరాట సన్నివేశాలతోనే సాగే ఆ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్దే కాదు, అవార్డుల పరంగానూ రికార్డ్స్ నమోదు చేసింది. అలాంటి సినిమా స్థాయికి తగినట్టు కథ వస్తే, ఎవ్వరైనా వదులుకుంటారా? మన రెబెల్‌స్టార్ ప్రభాస్ వదులుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కృష్ణవంశి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘చక్రం’ సినిమా తీయడానికి ముందు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తాను మ్యాడ్‌మ్యాక్స్ లాంటి ఓ సాలిడ్ యాక్షన్ కథను ప్రభాస్‌కి వినిపించానని కృష్ణవంశీ చెప్పారు. దాని ఔట్‌పుట్ బాగా వస్తుందని, కచ్ఛితంగా ఆడియన్స్‌కు నచ్చుతుందని, మనం ఈ సినిమా చేద్దామని తాను అతనికి చెప్పానన్నారు. కానీ.. తనకు ఆ సమయంలో కేవలం యాక్షన్ కథలే వస్తుండటంతో, కాస్త డిఫరెంట్‌గా ఏదైనా చేద్దామన్నాడని, అప్పుడే ‘చక్రం’ ఆలోచన వచ్చిందని అన్నారు. అలా చక్రం సినిమా చేయాల్సి వచ్చిందని వివరించారు. లేకపోతే తమ కాంబోలో అప్పుడే హాలీవుడ్ రేంజ్ సినిమా వచ్చేదని చెప్పుకొచ్చారు. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే!

అఫ్‌కోర్స్.. ‘చక్రం’ చిత్రానికి రెండు నంది పురస్కారాలు (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ లిరిసిస్ట్) అయితే వచ్చాయి గానీ, కమర్షియల్‌గా మాత్రం అది ఫ్లాప్‌గా నిలిచింది. దాని బదులు ప్రభాస్ లోకల్ మ్యాడ్‌మ్యాక్ తీసి ఉంటే, బహుశా అప్పుడు ఆ సినిమా సంచలనాలు సృష్టించేదేమో! ప్రభాస్‌ కటౌట్‌కి సూటయ్యేది కూడా అలాంటి మాస్ & యాక్షన్ సినిమాలే! కానీ ఇప్పుడనుకొని ఏం లాభం? జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. బహుశా భవిష్యత్తులోనైనా ప్రభాస్ అలాంటి తప్పుని రిపీట్ చేయడని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here