డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ రాబోతోందా?

0
176

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న హీరో సిద్దూకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతో అతడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్‌ చూస్తే దాదాపు అవుననే సమాధానం వస్తోంది. దేవుడి ఫొటోల ముందు స్క్రిప్ట్‌ పుస్తకాన్ని ఉంచి పూజ చేసిన ఫొటోను పంచుకుంటూ ‘మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ రౌండ్‌-2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ ఆగస్టు నుంచి మొదలవుతుంది’ అంటూ నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా తమన్ అందించిన పాటలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్‌గా నిలిచాయి. అట్లుంటది మనతోని అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ మూవీలో ప్రిన్స్‌, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.30 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆహా ఓటీటీలోనూ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. తాజాగా డీజే టిల్లు మూవీకి సీక్వెల్ వస్తుందని తెలియడంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here