Rakul Preet Singh: తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే!

0
160

నిన్నటిదాకా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్‌కి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. చివరిసారిగా ‘కొండపొలం’లో కనిపించిన ఈ భామ, ప్రస్తుతం హిందీ సినిమాలే చేస్తోంది. దీంతో, ఈ టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేసిందా? అనే ప్రచారం మొదలైపోయింది. ఆ అనుమానంతో అభిమానులు సైతం ఆమెని సోషల్ మీడియాలో నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ వార్తలపై రకుల్ క్లారిటీ ఇచ్చింది.

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రకుల్‌కి ఓ అభిమాని ‘‘మీరిక తెలుగు సినిమాలు చేయరా? హిందీ చిత్రాలకే పరిమితం అయ్యారా?’’ అనే ప్రశ్న సంధించాడు. ఇందుకు రకుల్ బదులిస్తూ.. ‘‘అందులో వాస్తవం లేదు, నేను కచ్ఛితంగా తెలుగు సినిమాలు చేస్తాను. కానీ, ఈసారి కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకు భాషతో సంబంధం లేదు, స్క్రిప్టే నాకు ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నానని, మంచి కథ వస్తే తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని ఈ భామ వివరించింది.

కాగా.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో నటించి, కొన్నాళ్లు ఇండస్ట్రీలో చక్రం తప్పింది. ఇంతలో ఇతర భామల నుంచి తీవ్ర పోటీ నెలకొనడం, రకుల్ ఇటు బాలీవుడ్‌లోనూ దృష్టి సారించడంతో.. తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ భామ హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఇవి విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here