మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న అతడు రెండో మూవీ కొండపొలంతోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా అతడు ‘రంగ రంగ వైభవం’గా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డైరెక్టర్ గిరీశాయ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ శనివారం నాడు బయటకు వచ్చింది. రంగరంగ వైభవంగా మూవీ ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలోనూ నటిస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పెళ్లిసందడి మూవీ ఫేం శ్రీలీల నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది.
#RangaRangaVaibhavanga Teaser on 27th JUNE pic.twitter.com/YxnmP0viWE
— T2BLive.COM (@T2BLive) June 25, 2022