తారక్ కోసం రంగంలోకి పాన్ ఇండియా బ్యూటీ..?

0
137

NTR30 సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మొదట్నుంచీ మిస్టరీగానే ఉంది. మొదట్లో ఆలియా భట్‌ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, సినిమా ఆలస్యం కావడం వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఆ తర్వాత ఆమెని సంప్రదించలేదన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇంకా సమంత, కృతీ శెట్టి సహా మరికొందరు భామల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. అవి రూమర్లుగానే మిగిలిపోయాయి.

ఇప్పుడు లేటెస్ట్‌గా మరో హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమె మరెవ్వరో కాదు.. రష్మికా మందణ్ణ. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్‌గానూ అవతరించడంతో.. భారీ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాన కూడా ఈ బ్యూటీ హవానే కొనసాగుతోంది కాబట్టి.. దర్శకనిర్మాతలు ఈమె వెంటే పడుతున్నారు. తాజాగా NTR30 చిత్రబృందం కూడా ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు.. ఆమెతో చర్చలు జరపడం, రష్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి అమ్మడు భారీ పారితోషికం కూడా అందుకుంటోందని ఇన్‌సైడ్ న్యూస్! అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదే సమయంలో.. లైగర్‌లో నటించిన అనన్యా పాండేని సైతం సంప్రదించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here