Resul Pookutty: ఆర్ఆర్ఆర్ ఒక గే లవ్ స్టోరీ అంటూ సంచలన వ్యాఖ్యలు

0
133

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడమే కాదు, మరెన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. అలాంటి చిత్రంపై కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆల్రెడీ విదేశీయుల్లో కొందరు దీన్ని గే సినిమాగా పేర్కొనగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత సౌండ్ ఇంజినీర్ రసూల్ పూక్కుట్టి వారికి వత్తాసు పలికాడు.

తొలుత బాలీవుడ్ నటుడు, దర్శకుడు మునీష్ భరద్వాజ్ ‘ఆర్ఆర్ఆర్’ను చెత్త సినిమాగా పేర్కొంటూ ఓ ట్వీట్ చేశాడు. ‘‘నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే ఒక చెత్త సినిమాను ఓ 30 నిమిషాల పాటు చూశాను’’ అంటూ చెప్పాడు. ఆ ట్వీట్‌కి బదులిస్తూ.. ‘‘ఆర్ఆర్ఆర్ అనేది ఒక గే లవ్ స్టోరీ’’ అని రసూల్ రీట్వీట్ చేశాడు. అంతేకాదు.. ఇందులో ఆలియా భట్, శ్రియా శరన్‌లను బొమ్మలుగా వినియోగించుకున్నారే తప్ప వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొన్నాడు. దీంతో, సినీ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు.

ఆస్కార్ అవార్డ్ గెలిచిన నువ్వు.. మన భారతీయ సినిమాపై అజ్ఞానిలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అంటూ రసూల్‌ని ప్రశ్నిస్తున్నారు. మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే.. ‘‘మీరు చేసిన కామెంట్‌తో మీపై గౌరవం పోయింది’’ అని ఓ నెటిజన్ చెప్తూ.. ‘‘వెస్ట్రన్ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. నేను దానిని కోట్ చేశాను’’ అని సమర్థించుకోవడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here