RRR Movie Ready To Release In Japan: మన తెలుగు సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణే ఉంది. ఇప్పటికే అక్కడ పలు సినిమాలు విడుదలై, హల్‌చల్ చేశాయి. వాటిల్లో జూ. ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ సినిమా ఒకటి. జపాన్‌లో తారక్‌కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. ఆ సినిమాని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదండోయ్.. రామ్ చరణ్ పాటలకి కూడా అక్కడ మంచి డిమాండ్ ఉంది. అక్కడి యువత కవర్ సాంగ్స్ చేస్తూ, మంచి వ్యూస్ కొల్లగొడుతోంది.
అంటే.. చరణ్, తారక్‌లకి అక్కడి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ఆర్ఆర్ఆర్ సినిమా ఆల్రెడీ గ్లోబల్‌గా చక్రం తిప్పింది. బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తే, ఓటీటీలో రచ్చ చేస్తోంది. హాలీవుడ్‌కి చెందిన ఎందరో టెక్నీషియన్స్ ఈ సినిమాపై కురిపించిన ప్రశంసల వర్షం అందరికీ తెలిసిందేగా! ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్‌ని జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన జపనీస్ భాషలో ఆర్ఆర్ఆర్‌ను జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
కాగా.. మార్చి 25వ తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. అటు, ఓటీటీల్లోనూ ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. జీ5లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. విదేశీయులు షేర్ చేస్తోన్న వీడియోలు, నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.