ప్రస్తుతానికి చావటం లేదు- సమంత

0
237

సమంత నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ ఈ నెల 11న ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే సమంత మయోసిటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేయగానే అందరూ షాక్ కి గురయ్యారు. అంతే కాదు ‘యశోద’ ప్రమోషన్స్ కి కూడా సమంత దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో సమంత ఇంటర్వ్యూ ఇస్తూ ‘యశోద’ సినిమా గురించి అలాగే తన డిసీస్ గురించి వివరించారు. ఆ వివరాలు మీ కోసం.. మామూలుగా స్క్రిప్ట్ ఓకె చేయటానికి టైమ్ పడుతుంది. కానీ ‘యశోద’ కథ విని షాక్ అయ్యాను, రియల్ సంఘటనలు బేస్ చేసుకుని తయారు చేసిన కథ విన్నప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి. సింగిల్ నెరేషన్ లోనే ఓకె చెప్పాను. నేను కథ విన్నపుడు ఎలా షాక్ అయ్యానో… రేపు థియేటర్లలో చూసిన ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు. అంత కాన్ఫిడెన్స్ ఉంది. అదే కొంత భయాన్ని కూడా కలిగిస్తుంది. ఇక నేను ఫైట్స్ చేయటం ఇంతలా ఎంజాయ్ చేస్తానని అనుకోలేదు. ఓ విధంగా చెప్పాలంటే నాకు డాన్స్ చేయటం కంటే ఫైట్స్ చేయటమే ఇష్టం.

‘యశోద’లో బాడీ డబుల్ లేకుండా యానిక్, వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేసి నాతో చేయించారు. ఓ ఫైట్ లో ఫంచ్ నా ఫేస్ కి తగిలింది కూడా… ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. వాటిలో క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే సూపర్. పూర్తి సినిమా నిన్ననే చూశాను. అమేజింగ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. ‘యశోద’ తను ఉండే ప్రపంచానికి, వెళ్ళిన ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. ఇందులోని ఎవా ఇన్ స్టిట్యూట్ అనేది మరో పాత్ర అనే చెప్పాలి. వరలక్ష్మి, ఉన్ని ముకుందన్ రోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే రావు రమేశ్, మురళీ శర్మ, ఎవా ఇన్ స్టిట్యూట్ లో గర్ల్స్ అందరివి ప్రాధాన్యత ఉన్న పాత్రలు. వీరందరూ బాగా చేశారు. సమంతగా నాకు, యశోదలో పాత్రకు చాలా పోలికలు ఉన్నాయి. పట్టుదల, హోప్స్, గోల్స్ విషయంలో పోలికలు ఉన్నాయి. అలాగే నా కెరీర్ లో ప్రస్తుతం టఫ్ ఫేజ్ ని ఫేస్ చేస్తున్నా. సినిమాలో యశోద కూడా అలాగే కష్టాలు అధిగమించి అనుకున్నది సాధిస్తుంది. ఇక డబ్బింగ్ కూడా ఛాలెంజ్ గా తీసుకుని తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెప్పాను. కెరీర్ తలచుకుంటే ఒక్కో రోజు ఇక ముందుకు వెళ్ళగలనా? అనే భయం కూడా వస్తుంది. కానీ ఇంత దూరం దాటి వచ్చాను కదా అనిపిస్తుంది. లైఫ్ లో ఎంతో మంది ఫైట్ చేసి సాధిస్తున్నారు కదా… ప్రస్తుతానికికైతే నేను చావలేదు. ఇది కష్టమైన విషయమే. కాకపోతే ఇంకా ఫైట్ చేయాలి. ఈ పరిస్థితి నాకు నేర్పింది ఒక్కటే. మన కంట్రోల్ లో ఏదీ ఉండదు. జీవితమే అన్నింటికి సమాధానం. మన మధ్య జరుగుతున్న విషయంతో తెరకెక్కిన థ్రిల్లర్. ప్రతి మలుపులో ఆశ్చర్యాన్ని, షాకింగ్ ని ఇస్తుంది. మణిశర్మ బీజియమ్, దర్శకుల టేకింగ్ సూపర్. తప్పకుండా సినిమాను థియేటర్లలో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here