దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్కసారైనా పని చేయాలని ఎవ్వరైనా కోరుకుంటారు. స్టార్ నటులు సైతం, ఆయనకు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పిలుపు రావడమే ఆలస్యం, సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి దర్శకుడిని ఓ స్టార్ నటుడు రిజెక్ట్ చేశాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. కరోనా లాక్డౌన్ సమయంలో రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్. అది కూడా ‘బాహుబలి2’ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం మరింత ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో సోనూ సూద్ మాట్లాడుతూ.. ‘‘బాహుబలి2 లోని ఒక రోల్ కోసం జక్కన్న సంప్రదించారు. డేట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన బల్క్ డేట్స్ అడిగారు. ఆ సమయంలో నేను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది’’ అని సోనూ సూద్ చెప్పుకొచ్చాడు. అయితే, ఏ పాత్ర ఆఫర్ చేశారన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. బహుశా అది సుబ్బరాజు నటించిన కుమార వర్మ పాత్ర అయ్యుండొచ్చని తెలుస్తోంది. అదే నిజమైతే.. సోనూ సూద్ నిజంగానే తన కెరీర్ లో ఒక గెల్డెన్ ఛాన్స్ ని వదులుకున్నట్టే!