ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్లు కూడా..చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టే చేయడం మూలా వచ్చినవే. కాగా ఈమధ్యకాలంలో 7/G బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను చరణ్ షేర్ చేసి.. ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంతే.. కొద్ది సేపట్లోనే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
సోనియాను త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారా అంటూ నెటిజన్లు ప్రశంసన వర్షం కురిపిస్తుంటే.. కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టేసారు. ఈ వార్త కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. కాగా.. ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ కు నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే రెండో సారి చరణ్ పోస్ట్ చేసిన పోటోలో సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. దీంతో కొందరు నెటిజన్లు ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ తో పోస్టేలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్ సోనియాతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీ బీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు.