ప్రతిభ ఉండాలేగాని ప్రయత్నిస్తే చరిత్రలో చెరగని ముద్రగా మిగిలిపోవచ్చు..పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు.. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు..ఆర్ధిక పరిస్థితితో పనిలేదు.. కావాల్సిందల్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల.. సాధించగలను అని మనమీద మనకి నమ్మకం.. అది ఉంటె చాలు పని చేస్తూ పోతే ఏదోరోజు విజయం వరిస్తుంది అని నిరూపించిన హీరోలలో కలర్ ఫోటో హీరో సుహాస్ ఒకరు.. షార్ట్ ఫిలిమ్స్ తో నటన జీవితాన్ని ప్రారంభించిన సుహాస్ మొదటిసారిగా 2018 లో “పడి పడి లేచే మనసు” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు..
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే మరో చిత్రంలో హీరోగ నటిస్తున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి నిన్న హీరో సుహాస్ పుట్టిన రోజు సందర్బంగా రీలీజ్ చేశారు..కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సుహాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉందీ సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు..
జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం లో కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది..