ఆ తమిళ నటుడితో బాలయ్య డిష్యుం డిష్యుం..?

0
123

ప్రస్తుతం NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్.. నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు. ఆల్రెడీ బాలయ్య కూతురిగా పెళ్లి సందD ఫేమ్ శ్రీలీలాను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మరో కీ-రోల్ కోసం ఓ తమిళ నటుడ్ని ఎంపిక చేశారని సమాచారం. ఆ నటుడు మరెవ్వరో కాదు.. అరవింద్ స్వామి.

ఒకప్పుడు హీరోగా అలరించిన అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ధృవ సినిమాలో ‘మనిషి ముసుగులో మృగమును నేనేరా’ అంటూ అతడు చూపించిన విలనిజం, అందరినీ కట్టి పడేసింది. అందులో అతను పోషించిన విలన్ రోల్‌ని సర్వత్రా ప్రశంసలు వచ్చిపడ్డాయి. అందుకే, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అరవింద్‌ని తీసుకోవడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు NBK108లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసమే అరవింద్ స్వామిని తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. వెండితెరపై బాలయ్య, అరవింద్ స్వామి మధ్య హోరాహోరీ పోరుని విట్నెస్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here