నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీతా భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ మూవీని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ మూవీకి `పంచతంత్ర కథలు` అనే యాప్ట్ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్‌తో స్వరపరిచాడు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ లీస్ట్‌లో చేర్చారు.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సాంగ్ విడుదల సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తన ఫేవరేట్ సాంగ్ అన్నారు. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ వినడం జరిగిందన్నారు. చాలా ఇన్స్‌పైరింగ్ సాంగ్ అని.. తప్పకుండా వైరల్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారని తెలిపారు. రామ్ మిరియాల అందరి ఫేవరేట్ అని.. ఇక సంగీత దర్శకుడు కమ్రాన్ చాలా కాలంగా తెలుసు అన్నారు. ఆయన మంచి ట్యూన్ ఇచ్చారని ప్రశంసించారు. లిరికల్ వీడియోలో దర్శకుడు శేఖర్ మేకింగ్, విజువల్స్ చాలా బాగున్నాయని పేర్కొన్నారు. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందని.. సర్‌ప్రైజింగ్‌గా తమ అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారన్నారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా ఉన్నానని.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.