నేటి నుంచి షూటింగ్‌లు బంద్‌.. సమ్మెకు సిద్ధం..

0
171

వేతనాలు పెంచాలని కోరుతూ తెలుగు సినీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి షూటింగ్‌లకు హాజరు కాబోమని సినీ కార్మికులు ప్రకటించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 24 విభాగాల కార్మికుల వేతనాలను పెంచాల్సి ఉంటుంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా నిర్మాతల మండలి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేటి నుంచి షూటింగ్‌లను బహిష్కరించి, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సినీ కార్మికులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఫెడరేషన్ నేటి నుంచి షూటింగ్‌లకు బంద్ కు పిలుపు ఇచ్చింది.

అయితే. షూటింగ్ లకు హాజరుకాని సిని కార్మికులు కృష్ణ నగర్ లో తమ యూనియన్ ఆఫీస్ లకు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here