Venu Swami: వేణు ప్రభాస్ పైన పడిందా నీ కన్ను..

0
36

వేణు స్వామీ.. ప్రపంచంలో ఏది జరిగిన నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని అని చెప్తూ మంచైనా చెడైనా ఏదైనా ఆయన ఖాతాలో వేసుకుంటాడు ఈ మహా యోగి.. హీరో నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకుల సమయంలో మొదైలంది ఈయన ట్రెండ్.. చైతు సామ్ విడాకుల అనంతరం నేను ముందే చెప్పాను కావాలంటే చూడండి ఇదే వీడియో ప్రూఫ్ అంటూ నట్టింట వైరల్ అయ్యారు వేణు స్వామీ..

అన్ని ముందే తెలిస్తే అనార్థాలని అపాయాలని ఆపొచ్చుగా.. పోనీ వాళ్లకి ముందే చెప్పొచ్చుగా.. అల చెయ్యరు సినీ రంగానికి చెంది ప్రముఖులు చనిపోబోతున్నారు, త్వరలోనే టాలీవుడ్ లో ఒక జంట విడిపోబోతుంది ఇలా ఇండైరెక్ట్ గ చెప్తారు.. మనుషులన్నాక చనిపోకుండా ఉంటారా? సినిమావాళ్లు కూడా మనుషులేగ..ఎవరో ఒకరు దురదృష్ట వశాత్తు చనిపోతే నేను ముందే చెప్పానుగ, ఎవరైనా కర్మకాలి విడిపోతే నేను ముందే చెప్పాను అంటారు ఈ జ్ఞాని.. చివరికి రెండు నెలల క్రితం ప్రభాస్ గురించి కూడా సంచలన వార్త చెప్పారు.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా డిసాస్టర్ గ నిలుస్తుందని వ్యాఖ్యానించారు.. కాకపోతే సినిమా విడుదలై విఫలం అయినా తర్వాత చెప్పారు అంతే.. అంటూ అభిమానులు అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు..

ఇంకా ప్రభాస్ కి పెళ్ళికాదని.. అయినా ఆ గొడవలు అవుతాయని చెప్పారు.. 40 సంవత్సరాల వయసు వచ్చాక అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి జరగడం కష్టం, అది అందరికి తెలిసిన విషయమే.. కానీ ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది కావున కచ్చితం గా కాదు అని చెప్పలేదు.. మన సర్వజ్ఞాని.. అవ్వదు అయితే గొడవలు వస్తాయి అన్నారు గొడవపడని దంపతులు ఉన్నారా? కలహాలు లేని కాపురం ఉందా..? ఇందుకే అంటారు నమ్మేవాళ్ళు ఉంటె ఏనుగు విమానం ఎక్కిందని చెప్పారంట ఇలాంటి వాడెవడో..అంటూ ఆయన వీడియోలు వీక్షిస్తున్న ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here