ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రామ్ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా గుర్తిండిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్ లిరికల్ సాంగ్‌కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్‌లో రామ్, కృతి వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ రోజు ‘విజిల్’ అనే సాంగ్ ను హీరో సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సాంగ్ డిజిటల్ రిలీజ్ కి హైదరాబాద్ – ఏఎంబీ సినిమాస్ వేదిక కానుండడం విశేషం. ఈ రోజు రాత్రి 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనుంది చిత్రయూనిట్. అయితే.. ఈ సినిమాను జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.