పైసా మే పరమాత్మ…ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాల వ్యాపారులు…

0
72

రోజుకి ఒక గ్లాస్ పాలు తాగడం ఆరోగ్యానికి చాల మంచిదని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు… ఎముకలు దృఢం గా ఉండడానికి కాల్షియమ్ చాల అవసరం ఈ కాల్షియమ్ పాలల్లో ఏక్కువగ ఉంటుంది అందుకే డాక్టర్లు కూడా రోజు పాలు తాగమని చూచిస్తుంటారు…ఇంకా చిన్నపిల్లల సంగంతి చెప్పక్కరలేదు ఎందుకంటే పసిపిల్లలకు పాలే ప్రధాన ఆహారం… కానీ ప్రస్తుత కాలంలో పాలు తాగితే పొందే లాభాలు అటుంచితే పాలు తాగితే లేని జబ్బుల్ని కొని తెచుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు…డైరీ ఫార్మ్ వాళ్లు పాలని నిల్వ చేయడంకోసం కెమికల్స్ కలుపుతారు… అలాంటి ప్యాకెట్ పాలు వాడితే కదా సమస్య మేము కలితీకాని పాలని మా కనులముందు గేదె లేదా ఆవు పొదుగు నుండి పితికిచ్చే డైరీ యజమానులనుండి పాలను కొనుగోలు చేస్తాం…కాబట్టి మాకు ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటే పొరపాటే…పల్లెటూళ్లలో ఇళ్లలో ఉండే గేదెలు, ఆవుల నుంచి పితికే పాలు ఆరోగ్యానికి మంచివి..కానీ పట్టణాలలో దొరికే పాలు మాత్రం కచ్చితంగా కల్తీ అవుతున్నాయి… పట్టణాలలో పాల కొరత తీవ్ర స్థాయిలో ఉంటుంది… ఈ కొరతనే కొందరు పాల వ్యాపారులు అదునుగా చేసుకుంటున్నారు… పశువులకు ఎప్పుడో బ్యాన్ చేసిన ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చి పాల ఉత్పత్తిని పెచుతున్నారు… ఇలా వచ్చిన పాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు… ఇలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది… పశువుల దాణా విక్రయించే ఒక దుకాణంలో ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు… పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో ఉన్న ఓ దాణా షాపుపై డ్రగ్ ఇన్స్‌పెక్టర్ల బృందం బుధవారం ఆకస్మిక దాడులు చేసింది. డజన్ల కొద్దీ ఆక్సిటోసిన్ బాటిళ్లను సీజ్ చేసింది…
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ని వాడడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని దుకాణం యజమాని పాడి రైతులకు విక్రయిస్తున్నాడు అని అధికారులు తెలిపారు… ఆక్సిటోసిన్ ఇంజక్షన్ చేసిన పశువుల పాలను తాగితే చాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని…ముఖ్యంగా బాలికలో చిన్నవయసులోనే రుతుస్రావం మొదలవుతుందని మనుషలకీ ఆరోగ్యానికి హానికరం అనే కారణం చేత ప్రభుత్వం ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్ న్ని బ్యాన్ చేసిందని ధికారులు వెల్లడించారు…దాణా షాపులో 250 ఎంఎల్ మోతాదులో ఉన్న 50 ఆక్సిటోసిన్ బాటిళ్లను అధికారులు సీజ్ చేసిన అధికారలు..వాటిని అనాలిసిస్ కోసం డ్రగ్స్ కంట్రోల్ లాబోరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆక్సిటోసిన్ ఉత్పత్తి, వాడకంపై ఆంక్షలున్నాయి. పశువులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇచ్చిన పాడి రైతులకు గతంలో కోర్టు జరిమానాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా బ్లాక్ మార్కెట్ లో ఈ ఇంజెక్షన్ల దందా నడూస్తూనే ఉంది.. అసలు ఈ ఇంజక్షన్ తయారీ సంస్థను మూసివేస్తే అసలు సమస్య ఉండదు కదా అని కొందరు అభిప్రాయం…అయితే ఆక్సిటోసిన్ అనేది సహజమైన హార్మోన్. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచానికి ఇది కారణమవుతుంది. అప్పుడే పిల్లలకు జన్మనిచ్చిన తల్లుల్లో చనుబాలు బాగా రావడానికి.. రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఈ హార్మోన్‌ను అతి కొద్ది మోతాదులో ఇస్తారు. అందుకే కొన్ని ఫార్మా సంస్థలు ఈ ఇంజెక్షన్స్ ని లైసెన్స్ పొంది లీగల్ గా తాయారు చేస్తారు కానీ కొందరు అక్రమదారులు ఈ ఇంజెక్షన్స్ ని స్వార్ధానికి ఉపయోగిస్తున్నారు…ఎన్ని సార్లు పట్టుబడిన చేసిన తప్పుకి శిక్ష పడిన వాళ్ళ పంథా మాత్రం మార్చుకోవంలేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here