జమ్మూ కాశ్మీర్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు.. స్వాతంత్య్రం తర్వాత ఇప్పుడే

0
53

జమ్మూ కాశ్మీర్ లో మార్పు మొదలైంది. గతంలో ఉగ్రవాదం, నిత్యం కాల్పుల చప్పుళ్లు, పేలుళ్లతో హింసాత్మక సంఘటనలకు కేంద్రంగా ఉండే కాశ్మీర్ లో పరిస్థితులు నెమ్మనెమ్మదిగా కుదుటపడుతున్నాయి. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కేంద్రబలగాలు, ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెడుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి చొరబాట్లను అడ్డుకుంటోంది.

స్వాతంత్య్రం అనంతరం ఎప్పుడే లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1.62 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఇది భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధికం. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇదే సాక్ష్యమని అక్కడి అధికారులు చెబుతున్నారు. మూడు దశాబ్ధాల తర్వాత కాశ్మీర్ పర్యటకులను ఆకర్షిస్తోంది. ఇది కాశ్మీర్ టూరిజనానికి స్వర్ణయుగం లాంటిది అని పర్యాటకరంగ నిపుణులు చెబుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ ఆదాయానికి పర్యాటకమే ముఖ్య ఉపాధి వనరు. జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఇందులో ఈ ఏడాది నిర్వహించిన అమర్ నాథ్ యాత్రలో 3.65 లక్షల మంది పర్యాటకులు కూడా ఉన్నారు. కాశ్మీర్ లోని అందమైన లోయలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్, వంటి ప్రదేశాలతో పాటు శ్రీనగర్ లోని అన్ని హోటళ్లు, గెస్ట్ హౌజులు 100 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. పూంచ్ , రాజౌరి, జమ్మూ అన్ని ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో సినిమాల చిత్రీకరణ కోసం సమగ్ర ఫిల్మ్ పాలసీని ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింతగా పర్యాటకులు వస్తారని అక్కడి అదికారులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here