మహిళామణులు.. దేశంలో 15 శాతం పైలెట్లు వీరే.. గ్లోబల్ యావరేజీ కన్నా ఎక్కువ..

0
177

భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది.

2021లో మొత్తం 244 పైలెట్లను వివిధ ఎయిర్ లైన్స్ రిక్రూట్ చేసుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో దేశానికి 1000 మంది పైలెట్లు అవసరం అని విమానయానం రంగం అంచనా వేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, భారతదేశంలోని వివిధ దేశీయ విమానయాన సంస్థలలో 67 మంది విదేశీ పైలెట్లతో సహా సుమారు 10,000 మంది పైలట్లు పనిచేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 35 ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనూజేషన్లు ఉన్నాయి. వీటికి డీజీసీఏ అనుమతి ఉంది. ఇవి 53 బేస్ లలో పనిచేస్తున్నాయి.

భారతదేశంలో విమానయానం రంగం రాబోయే కొన్నేళ్లలో విస్తరించబోతోంది. ఇటీవల ఎయిర్ ఇండియా ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకుంది. ఏకంగా 80 బిలియన్ డాలర్ల వ్యయంతో 540 విమానాలను కొనుగోలు చేయనుంది. ఇదే విధంగా ఇండిగో, ఆకాశ వంటి ఎయిర్ లైన్ సంస్థలు కూడా రాబోయే కొన్నేళ్లలో విమానాల సంఖ్యను పెంచాలని భావిస్తున్నాయి. దీంతో రాబోయే కొన్నేళ్లలో ఇండియాలో పైలెట్లకు భారీ డిమాండ్ ఏర్పడబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here