ఎక్కడైనా పిల్లల మనసు కష్టపెట్టకూదని తల్లి దండ్రులు ఆలోచించడం సహజం.. పిల్లలు అడిగిన భోమ్మలు ఇస్తారు.. కోరిన డ్రెస్సులు తీయిస్తారు.. ఏ కష్టం రాకుండా చూసుకుంటారు స్తోమత ఉన్నోళ్లు.. అలా అడిగిందల్లా కొనివ్వలేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నచ్చ చెప్పుకుంటారు.. అంతేగాని అనాలోచితంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? కొడుకు మరణ వార్త కూతురి దగ్గర దాచేందుకు ౩౦ రోజుల పసికందును కిడ్నాప్ చేసి తన కూతురితో రాఖీ కట్టించాలనుకున్నారు ఓ జంట.. ఈ వింత ఘటన ఢిల్లీ లో చోటు చేసుకుంది..
ఢిల్లీ వాసులైన సంజయ్ గుప్తా అతని భార్య అనిరా గుప్తా.. వారికి ఇద్దరు పిల్లలు.. ఒక కొడుకు, ఒక కుమార్తె.. కాగా వాళ్ల కొడుకు టెర్రస్ పై నుంచి పడి చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని వారు తమ 17 ఏళ్ల కుమార్తె దగ్గర దాచిపెట్టారు. రాఖీ పండుగ వస్తూ ఉండటంతో వారి కుమార్తె సోదరుడికి రాఖీ కట్టాలని పట్టుబట్టింది. దీంతో సోదరుడి మరణ వార్త ఆమెకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడ్డారు తల్లిదండ్రులు.. అలానే సోదరునికి రాఖీ కట్టాలనే కూతురి కోరికను తీర్చాలి అనుకున్నారు..
అనుకున్నట్టుగానే రోడ్ పక్కన ఫుట్ పాత్ పైన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ౩౦ రోజుల పసికందుని కిడ్నాప్ చేసారు.. అయితే కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు ఫుట్ పాత్ ప్రాంతంలోని సి.సి కెమెరాలను పరిశీలించగా అందులో ఎవరో ఆడమనిషి వెనుక కూర్చోగా ఇద్దరు మగ వ్యక్తలు ఉన్న బైక్ ఆ ప్రాంతంలో పలుసార్లు చక్కర్లు కొట్టినట్లు గమనించారు. వారి బైక్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వారిని ఢిల్లీకి చెందిన సంజయ్ గుప్తా, అనిరా గుప్తాలుగా గుర్తించారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్ గుప్తా, అనిరా గుప్తాలని అదుపులోనికి తీసుకుని విచారించగా సోదరునికి రాఖీ కట్టాలనే కూతురు కోరికను తీర్చడానికే ఇలా చేసాం అని చెప్పారు.. దీంతో వారిని అరెస్ట్ చేశామని నార్త్ ఢిల్లీ డీజీపీ సాగర్ సింగ్ కల్సీ తెలిపారు..