దంపతులమధ్య గొడవలు సహజం.. కొన్ని సార్లు అకారణంగా కూడా గొడవలు పడతారు.. ఇక భార్యభర్తల మధ్య పోసిసివ్ నెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. భార్య ముందు భర్త వేరే అమ్మాయిని పొగిడితే ఆ భార్యలో పెరిగిన బీపీకి స్పిగ్మోమానోమీటర్ పేలిపోవాల్సిందే.. అలానే భార్య వేరే అబ్బాయిని పొగిడిన భర్త ఉడుక్కొవడం సహజం..
కొన్నిసార్లు ఇలా ఒకరి ముందు ఇంకొకరిని పొగుడుతూ ఒకర్ని ఒకరు సరదాగా ఏడిపించుకుంటుంటారు.. కాగా ఈ సరదానే ఒక మహిళ విషయంలో రివర్స్ అయ్యింది.. ఆ సరదాకాస్త భర్త అనుమానించేలా చేసింది.. ఇంతకీ ఎం అయినది అనుకుంటున్నారా.. వివరాలలోకి వెళ్తే..
గుజరాత్ లోని వడోదరలో ఓ మహిళ తన భర్త రోజు కొడుతున్నాడని పోలీస్ హెల్ప్లైన్ కి ఫోన్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేసింది.. అయితే పోలీసులు భర్త ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించగా దానికి ఆమె చెప్పిన సమాధానం విని ఆశ్చర్య పోయ్యారు.. ఇంతకీ ఆ మహిళ చెప్పిన కారణం ఏంటంటే..
నేను సల్మాన్ ఖాన్ అభిమానిని..ఒకసారి నేను నా భర్త ముందు సల్మాన్ ఖాన్ న్ని పొగిడాను.. అప్పటి నుండి నా భర్త నన్ను సల్మాన్ ఖాన్ సినిమాలు చూడనివ్వట్లేదు.. అలానే టీవీలో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంటే ఛానల్ మార్చేస్తాడు.. అలానే సల్మాన్ ఖాన్ యాడ్స్ కూడా చూడనివ్వట్లేదు..
నేను ఒకవేళ చూస్తే కొడుతున్నాడు.. ఇంకా బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సల్మాన్ ఖాన్ హోర్డింగ్‌లు కూడా చూడనివ్వడని తెలిపింది. కాగా ఇటీవల టీవీలో సల్మాన్ సినిమా చూస్తుంటే గొడవ పడి నన్ను కొట్టాడు, అందుచేత ఇంట్లో నుంచి బయటకు వచ్చేశానని ఆమె పేర్కొంది.. ఆ మహిళ చెప్పిన మాటలు విని పోలీసులు అవ్వాకయ్యారు.. కేసు నమోదు చేసుకుని భార్య భర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు..