ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆమ్ ఆద్మీ పార్టీదే.. బీజేపీకి బిగ్ షాక్..

0
81

ఢిల్లీ ప్రజలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీని ఆప్ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. బీజేపీ కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ)ని చీపురు పార్టీ గెలుచుకుంది. మొత్తం 250 స్థానాలు ఉన్న డీఎంసీ ఫలితాలు వెల్లడయ్యాయి. 134 వార్డులను ఆప్ గెలుచుకోగా.. 104 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా అంచానా వేసిన విధంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించలేదు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. బీజేపీ 100 స్థానాలను క్రాస్ చేసింది. ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా వ్యక్తం అవుతుందని.. ఆప్ భారీ మెజారిటీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ అలా జరగలేదు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారం సాధించాలంటే మ్యాజిక్ ఫిగర్ 126, ఆప్ పార్టీ ఈ ఫిగర్ ను దాటి 134 స్థానాలను సాధించింది. బీజేపీ 104 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించింది.  2017 ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 272 వార్డులలో బీజేపీ 181 వార్డులను,  ఆప్ 48 , కాంగ్రెస్ 30 స్థానాల్లో విజయం సాధించింది.  వార్డుల డీలిమిటేషన్ తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రంగా మారింది ఎంతగా అంటే ఓ జాతీయపార్టీ కనీసం రెండంకెల స్థానాలను కూడా కైవసం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 250 వార్డుల్లో కేవలం 9 స్థానాలను కైవసం చేసుకుంది. మరో ముగ్గురు స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here