ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం జరిగింది. తన చెల్లిలితో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బాధితురాలు ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగినట్లు బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్ కంట్రోల్ రూపంకు కాల్ వచ్చింది. ఉదయం 7.30 గంటలకు బాలికపై యాసిడ్ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ కోరుతోందని ట్వీట్ చేశారు.
ఈ దాడిలో బాలిక ముఖం కాలిపోయింది. ఈ రోజు ఉదయం తన 17 ఏళ్ల కుమార్తె తన 13 ఏళ్ల చెల్లితో కలిసి బయటకు వెళ్లిందని.. అకస్మత్తుగా బైకుపై ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి వచ్చి.. తన పెద్ద కుమార్తెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారని బాధితురాలి తండ్రి వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
दिल्ली में दिनदहाड़े छात्रा पर एसिड अटैक।
सुप्रीम कोर्ट द्वारा तेज़ाब की बिक्री पर प्रतिबंध लगाए जाने के बाद भी एसिड खुलेआम कैसे बिक रहा है?
पुलिस और सरकार को इसका जवाब देना होगा।
बीजेपी के बेटी बचाव मॉडल पर एक और धब्बा। #AcidAttack#CrimeCapital@NCWIndia @DelhiPolice pic.twitter.com/QLXBczJN6J
— Netta D'Souza (@dnetta) December 14, 2022