Breaking News : ఆర్బీఐ డైరెక్టర్‌గా ఆనంద్‌ మహీంద్రా..

0
136

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా పలు పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమించింది. ఆర్‌బీఐ డైరెక్టర్‌గా ఆనంద్ మహీంద్రాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. అయితే ఆనంద్‌ మహీంద్రాతో పాటు.. రవీంద్ర ధోలాకియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్‌లను కూడా ఆర్బీఐ డైరెక్టర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.

తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త అపాయింట్‌మెంట్‌లు నాలుగు సంవత్సరాల పాటు ఉంటాయి. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి అనుగుణంగా కేంద్రం నియమించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా రిజర్వ్ బ్యాంక్ వ్యవహారాలు నియంత్రించబడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here