పెళ్లైన 25రోజులకే భార్యను చంపి గోనెసంచిలో కుక్కి…

0
21

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ ఉదంతం మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన 25 రోజులకే ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి అతి క్రూరంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆమె శవాన్ని గోనె సంచిలో పెట్టి అడవిలో పడేశాడు. అజ్మీర్ జిల్లాలోని క్రిస్టియన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ దంపతులు 26 రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్ స్ట్రీట్ నంబర్-4లో నివసించే ముఖేష్ సింధీ (34) నయాబజార్‌లో బట్టల షాప్ నడుపుతున్నాడు. గతేడాది ఆగస్టులో ముఖేష్ స్నేహితుడు రమేష్ .. భగవాన్ గంజ్‌లో నివసించే జెన్నిఫర్ (32)ని పరిచయం చేశాడు. ఇద్దరు ప్రేమించుకుని 26 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. బుధవారం ఉదయం ముఖేష్‌, జెన్నిఫర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. నన్ను క్షమించండి, ఇంకా ఎప్పుడూ అలా చేయనని జెన్నిఫర్ .. తన భర్తను వేడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి ఇంట్లో నుంచి శబ్దాలు ఆగిపోయాయని.. కొంతసేపటికి ముఖేష్ .. ఓ గొనె సంచితో బయటికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సంచిని స్కూటీపై ఉంచుతుండగా కిందపడినప్పుడు ఆమె మృతదేహాన్ని చూసినట్లు వారు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళం పగలగొట్టి పరిశీలించారు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ఇంతలో.. మృతదేహాన్ని బయట పడేసి ముఖేష్ ఇంటికి వచ్చాడు. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు కలెక్టరేట్ సమీపంలో ముఖేష్ ను పట్టుకున్నారు. పోలీసుల తమదైనశైలి విచారించగా తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని పుష్కర్ ప్రాంతంలో పడేసినట్లు భర్త చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు ముఖేష్‌ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. జెన్నిఫర్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఆమె తల్లి పెంచింది. బాధితురాలి సోదరుడు ముఖేష్ కట్నం డిమాండ్ చేస్తున్నాడని .. ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here