రెస్టారెంట్, హోటళ్లకు వెళ్లే వారికి శుభవార్త తెలిపింది సీసీపీఏ సంస్థ. మనం ఆర్డర్ చేసి తినే తిండికన్నా ఎక్కవగా సర్వీస్ చార్జీలు కట్టాలంటూ తల పట్టుకునే పరిస్థితి. ప్రశ్నించడానికి కూడా సమయం లేకుండా.. బిల్లుల్లోనే ఆటోమేటిక్ గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షన ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారరీ చేసింది. ఒకవేళ వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. అయితే.. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వ్యాపార విధానాలను అరికట్టేందుకు సీసీపీఏ సోమవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
అంతేకాకుండా.. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమేనని కస్టమర్లకు చెప్పకుండా, హోటళ్లు, రెస్టారెంట్లు దాన్ని బిల్లులో ఆటోమేటిక్‌గా చేరుస్తున్నాయని ఫిర్యాదులు మా దృష్టికొచ్చాయని, దాన్ని చెల్లించాలంటూ కస్టమరును బలవంతపెట్టకూడదని పేర్కొంది. అయితే.. ఇది స్వచ్ఛందమైనది.. ఐచ్ఛికమైనది మాత్రమేనని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొనడమే కాకుండా.. సర్వీస్ చార్జీ వసూలు ప్రాతిపదికన లోపలికి ప్రవేశం విషయంలో గానీ సేవలు అందించడంలో గానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొంది. అయితే.. ఆహారం బిల్లులో సర్వీస్ చార్జీని చేర్చడం, ఆ తర్వాత మొత్తంపై జీఎస్‌టీని వసూలు చేయడం వంటివి సరికాదని సీసీపీఏ స్పష్టం చేసింది.
ఫిర్యాదు చేయండిః
అయితే.. ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంటు సర్వీస్ చార్జీ విధించిన పక్షంలో.. బిల్లు మొత్తం నుంచి దాన్ని తొలగించాలంటూ సదరు సంస్థను కస్టమరు కోరవచ్చు. అయినప్పటికీ ఫలితం లేకపోతే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (NCH) నంబరు 1915కి లేదా NCH మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. తొందరగా ఫిర్యాదు చేయాలంటే.. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఈ–దాఖిల్ పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేయవ్చని పేర్కొంది. అంతేకాకుండా.. అలాగే విచారణ.. చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టరును కూడా ఆశ్రయించవచ్చని, సీసీపీఏకి ఈ–మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు పంపవచ్చని వివరించింది.
No hotels or restaurants can add service charges automatically or by default in the food bill: Union Consumer Affairs Ministry
— ANI (@ANI) July 4, 2022