గుజరాత్, హిమాచల్ పీఠాలు బీజేపీవే.. ప్రీపోల్ సర్వేలో వెల్లడి..

0
46

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే గడువు ఉంది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి చూపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల నాడిని తెలుపుతాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. గుజరాత్ లో రెండు విడతలుగా.. హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

కాగా.. మరోసారి గుజరాత్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ స్వీప్ చేయనుందని.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాషాయ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. పంజాబ్ ఎన్నికల గెలుపును గుజరాత్ లో పునరావృతం చేయాలని ఆప్ భావిస్తోంది. ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఆప్ భారీగా పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆప్ 12 నుంచి 17 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపే అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది.

ఎన్నికల ఫలితాలు-ప్రీ పోల్ సర్వే..

సర్వే ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 సీట్లలో బీజేపీకి 131 నుంచి 139 స్థానాలు వస్తాయని తేలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 39 వరకు ఆప్ కు 13-17 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 45.4 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కు 29.1 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 20.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేవలం 0 శాతానికే పరిమితమైన ఆప్ ఓట్ షేర్ గణనీయంగా పెరగనుంది. గతంలో పోలిస్తే బీజేపీ 3.7 శాతం ఓట్ షేర్ తగ్గనుందని.. కాంగ్రెస్ పార్టీకి 12.4 శాతం ఓట్ షేర్ తగ్గుతుందని సర్వేలో తేలింది.

హిమాచల్ ప్రదేశ్ లో ఒపీనియన్ పోల్ ప్రకారం మొత్తం 68 సీట్లలో బీజేపీకి 37 నుంచి 45 స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ పార్టీకి 21-29 సీట్లు రావచ్చని సర్వే తేల్చింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజలు మూడ్ మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here