ఇకపై పైలెట్లు, విమాన సిబ్బందికి బ్రీత్ అనలైజింగ్ టెస్టులు

0
120

కోవిడ్ కారణంగా గతంలో విమాన సిబ్బంది, పైలెట్లకు బ్రీల్ ఎనలైజర్ టెస్టులపై నియంత్రణ ఉండేది. అయితే తాజాగా అక్టోబర్ 15 నుంచి ప్రతీ విమాన సిబ్బందికి తప్పకుండా బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాల్సిందే అని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం ఆదేశించింది. గతంలో కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆల్కాహాల్ స్థాయిలను తనిఖీ చేయడానికి .. కేవలం 50 శాతం సిబ్బందికి మాత్రమే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను పరిమితం చేసింది.

తాజాగా డీజీసీఏ నిర్ణయంతో అక్టోబర్ 15 నుంచి పైలెట్లు, ఫ్లైట్ సిబ్బందిలో ఆల్కాహాల్ స్థాయిలను పరీక్షించేందుకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులకు చేయించుకోవాల్సిందే. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు విమానాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. దీంతో సిబ్బంది అందరికీ పరీక్షలు చేయాల్సిందే అని బుధవారం ఉత్వర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. ఏటీసీ సిబ్బంది, కమర్షియల్ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇతర సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతుందని పేర్కొంది.

సీసీ కెమెరాలు ఉన్న బహిరంగ ప్రదేశాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్ష నిర్వహించే డాక్టర్ ఇతర సిబ్బంది పరీక్షకు ముందు సిబ్బందిని కోవిడ్ లక్షణాలు ఉన్నాయా..? లేవా..? అని పరీక్షిస్తుంది. ఒక వేళ విమాన సిబ్బందికి కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని బ్రీత్ అనలైజర్ పరీక్ష నుంచి మినహాయించడంతో పాటు.. విధులను నుంచి తొలగిస్తారని చెప్పింది. కోవిడ్ సోకిన వ్యక్తులకు అవరసమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఫిట్ గా ఉన్నట్లయితేనే విధుల్లోకి తీసుకుంటారని డీజీసీఏ వెల్లడించింది. పరీక్ష నిర్వహించే డాక్టర్లు, పారమెడికల్ సిబ్బంది కూడా డ్యూటీలో చేరడానికి ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన రాపిడ్ యాంటిజెన్ లేదా.. ఇతర ఏదైనా కోవిడ్ టెస్టును తప్పకుండా చేయించుకోవాలని సూచించింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు ముందు, తర్వాత పరికరాలను యూవీ స్టెరిలైజర్ తో శుభ్రపరచాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here