New Traffic Rules: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రక్తదానం చేయాల్సిందే..!

0
109

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికొతే.. జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, జైలుకు పంపడం వంటి శిక్షలు ఉన్నాయి.. మళ్లీ మళ్లీ దొరికితే.. జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పెరుగుతూ పోతోంది.. ఇప్పుడు ఆ జాబితాలో కొత్త శిక్ష వచ్చింది.. పంజాబ్‌ ప్రభుత్వం మందు బాబుల కోసం కొత్త శిక్ష అమలు చేస్తోంది.. శిక్షలో రక్తదానం కూడా చేర్చింది.. ఓవర్‌ స్పీడ్‌తో వాహనాలు నడిపినా.. తాగిన డ్రైవింగ్‌ చేసినా.. ఈ శిక్షలు అమలు చేస్తారు.. ఓవర్‌ స్పీడ్‌ డ్రైవింగ్‌లో మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయలు, మళ్లీ దొరికితే రూ. 2,000 చొప్పున ఫైన్‌ ఉంటుంది.. అదే మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ దొరికితే మొదటిసారి రూ. 5,000.. తర్వాత రూ. 10,000 విధిస్తారు.. అంతేకాదు.. వారికి వివిధ రకాల శిక్షలు కూడా ఉంటాయి.. అందులో సమీపంలోని స్కూళ్లలో కనీసం 20 మంది (9 నుంచి 12 తరగతుల) విద్యార్థులకు 2 గంటలకు పైగా బోధించడం.. లేదా సమీపంలోని ఓ ఆసుపత్రిలో కనీసం 2 గంటల పాటు సామాజిక సేవ చేయడం.. అదికాకపోతే ఒక యూనిట్‌ రక్తం దానం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం..

పంజాబ్‌లో వేగ పరిమితిని మించి లేదా మద్యం, మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేస్తే, ఆ రాష్ట్రం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, జరిమానాలు మరియు లైసెన్స్ తాత్కాలిక సస్పెన్షన్‌తో పాటు, ఇప్పుడు ఆసుపత్రిలో సమాజ సేవ లేదా తప్పనిసరి రక్తదానం శిక్ష విధించనున్నారు.. ఇక, మళ్లీ మళ్లీ ఆదే తప్పుచేస్తూ దొరికిపోతే.. ఫైన్‌ విధించే మొత్తం సంఖ్య పెరుగుతూ పోతోంది.. కానీ, సమాజ సేవ మాత్రం చేయాల్సి ఉంటుంది.. వేగ పరిమితిని మించిన మొదటి నేరానికి రూ. 1,000 జరిమానా మరియు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయబడుతుంది. మద్యం తాగి వాహనం నడిపినందుకు, అదే వ్యవధిలో లైసెన్స్ సస్పెన్షన్‌తో పాటు రూ.5,000 జరిమానా ఉంటుంది..

ఇక, రెండోసారి అతివేగానికి రూ. 2,000 ఫైన్‌, మళ్లీ మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్‌తో పాటు, మద్యం సేవించి వాహనం నడిపితే సస్పెన్షన్‌తో పాటు రూ. 10,000 జరిమానా విధించబడుతుంది. అంతేకాదు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ద్వారా రిఫ్రెషర్ కోర్సును కూడా చేపట్టాలి.. మరియు ప్రతి నేరానికి సమీపంలోని పాఠశాలలో కనీసం 20 గంటల పాటు 9 నుండి 12వ తరగతి వరకు కనీసం 20 మంది విద్యార్థులకు బోధించాలి. అప్పుడు వారికి నోడల్ అధికారి ద్వారా సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది, అది జరిమానాలు చెల్లించే సమయంలో అధికారులచే ధృవీకరించబడుతుంది. దీనికి అదనంగా, నేరస్థులు సమీపంలోని ఆసుపత్రిలో కనీసం రెండు గంటలపాటు సమాజ సేవ చేయాలి లేదా సమీపంలోని బ్లడ్ బ్యాంక్‌లో కనీసం ఒక యూనిట్ రక్తాన్ని దానం చేయాల్సి ఉంటుంది.. మొత్తంగా జరిమానాలతో పాటు.. సామాజిక సేవను కూడా జోడిస్తున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here