ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ

0
122

ఢిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాతో పాటు 12 మంది వ్యక్తులపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై మంత్రి సిసోడియా నివాసంతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టిన సీబీఐ.. 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ప్రథమ ముద్దాయిగా సిసోడియా పేరును చేర్చింది. తాజాగా వీరిలో 13మందిపై సిబిఐ లుకౌట్‌ నోటీసుల్చింది. దీంతో వీరిపై విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. లుకౌట్ నోటీసు ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఒకవేళ దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు.

ఈ నోటీసుపై సిసోడియా స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇదేం డ్రామా అంటూ మండిపడ్డారు. “మీరు చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి, ఒక్క పైసా కూడా దొరకని ఫౌల్ ప్లే ఇప్పుడు, మీరు మనీష్ సిసోడియా పరారీలో ఉన్నారని లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసారు, ఇది ఏమి జిమ్మిక్, మోడీ జీ? నేను బహిరంగంగా తిరుగుతున్నాను. ఢిల్లీలో, నేను ఎక్కడికి రావాలి చెప్పు?” ప్రధాని నరేంద్ర మోదీపై హిందీలో దాడి చేస్తూ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు ఏడు రాష్ట్రాలతో సహా 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో పాటు బ్యాంకు లావాదేవీల వెరిఫికేషన్ ప్రక్రియను దర్యాప్తు సంస్థ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు, మద్యం కంపెనీల అధికారులు, డీలర్లతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.సిసోడియా, అర్వా గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను సిఫారసు చేయడంలో మరియు తీసుకోవడంలో కీలకంగా ఉన్నారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here