ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు.. యూపీకి మాత్రం 3,733 కోట్లు..

0
654

ఏపీ, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.. ప్రస్తుత 2022-23 అర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు గాను అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ సంస్థలకు నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రత అభివృధ్ది కోసం నిధులను విడుదల చేసినట్టు పేర్కొంది కేంద్ర సర్కార్‌ ..

అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుద‌ల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకకు కలిపి రూ.15,705.65 కోట్లు రిలీజ్‌ చేసింది.. ఇందులో బీహార్‌కు రూ.1,921 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.557 కోట్లు, గుజరాత్‌కు రూ.1,181 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌కు రూ. 224.30 కోట్లు, జార్ఖండ్‌కు రూ.249.80 కోట్లు, కర్ణాటకకు రూ. 1,046.78 కోట్లు, కేరళకు రూ. 623కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 1,472 కోట్లు, మహారాష్ట్రకు రూ.1,092.92 కోట్లు, మేఘాలయకు రూ. 40.50 కోట్లు, నాగాలాడ్‌కు రూ.18.40 కోట్లు, ఒడిశాకు రూ.864 కోట్లు, తమిళనాడుకు రూ. 1,380.50 కోట్లు, తెలంగాణ‌కు రూ.273 కోట్లు, త్రిపురకు రూ.73.50 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కి రూ.3,733 కోట్లు విడుదల చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here