ట్రాన్స్‌జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు

0
124

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ పోలీస్ శాఖలోకి తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను రిక్రూట్ చేసుకుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పోలీసులు లింగవివక్షతను రూపుమాపేందుకు దీన్ని ఓ ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం 608 మంది ఎంపికైన అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కాంకేర్ జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు బస్తర్ జిల్లాకు చెందిన వారు.

అయితే వీరిందరిని అత్యంత కీలకమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించే ‘ బస్తర్ ఫైటర్స్’ విభాగంలోకి తీసుకుంటున్నారు. బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల నుంచి 53,336 దరఖాస్తులు రాగా.. ఇందులో 16 మంది ట్రాన్స్‌జెండర్లు, 37,498 పురుషులు, 15,822 మంది మహిళలు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. 16 మందిలో తొమ్మిది మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వీరికి రాయ్ పూర్ లోన పోలీస్ ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ ఇవ్వనున్నారు.

2020 నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ బలగాల్లో పోలీసులు, స్థానిక గిరిజనుల మధ్య అంతరాన్ని తగ్గించాలని.. స్థానికంగా ఉండే గిరిజనులను రిక్రూట్ చేసుకుంటోంది. వీరిని చేరికను సీఎం భూపేష్ భాఘేల్ ప్రశంసించారు. వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పోలీసు శాఖలోకి ట్రాన్స్‌జెండర్ల రిక్రూట్‌మెంట్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు మా ప్రభుత్వం ప్రారంభించిన ఒక అడుగు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు మరియు కానిస్టేబులరీలు చైతన్యవంతులయ్యేలా ఈ చర్య ఉందని’’ ప్రశంసించారు.

బస్తర్ ప్రాంతంలోని కంకేర్, నారాయణపూర్, కందగావ్, బీజాపూర్, దంతేవాడ, జగదల్పూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ అభయారణ్యం మావోలకు అడ్డాగా ఉంది. దీంతో ఆ ప్రాంతంపై పట్టు ఉండే గిరిజనులను తీసుకుంటే.. అక్కడి భాష, మాండళికం, భౌగోళిక స్వరూపాలపై వారికి పట్టు ఉంటుందని.. తర్వాత ఆ ప్రాంతంలో మావోయిస్టులను కట్టడి చే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here