ఎలాంటి సినీ నేపధ్యం లేని కుటుంభం నుండి వచ్చి తనకంటూ ఒక స్టార్డంని సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఫైట్ చేసిన.. పాటకి స్టెప్పులేసిన ఆయనకి ఆయనే సాటి ఆయనకు ఎవరు రాలేరు పోటీ అన్నట్లు ఉంటుంది.. పాత్ర ఏదైనా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారా అనే భావన ఆయన సినిమా చుసిన ప్రేక్షకులకి కలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే పాత్రకి ప్రాణం పోస్తారు ఆయన, ఈయన నటించారా లేక జీవించార అనే వింధంగా మెగాస్టార్ నటన ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు..
ఎవరియాకైనా వయసు పైబడే కొద్దీ శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల వన్నె తగ్గడం సహజం..కానీ మెగాస్టార్ అందం వయసుతో పాటు పెరుగుతుందా అనేలా యువ హీరోల గ్లామర్ కి ఏ మాత్రం తగ్గకుండ ఉంది చిరంజీవి అందం.. తాజాగా చిరంజీవికి సంబంధించిన కొన్ని స్టిల్స్.. తమ్మన్న హీరోయిన్ గా కీర్తి సురేష్ చెల్లిగా మెగాస్టార్ హీరోగా నటించగా భారీ అంచనాలతో తెరకెక్కిన భోళాశంకర్ బాక్సాఫీస్ వద్ద పరాభవాన్ని చవిచూసింది.. ప్రేక్షకులకి నిరాశను మిగిల్చింది.. నెక్స్ట్ సినిమా అయినా హిట్ అవుతదనే ఆశలో ఉన్నారు మెగాస్టార్ అభిమానులు..
చిరంజీవి తన తదుపరి సినిమా మురగదాస్ దర్శకత్వంలో చేయాలనీ భావిస్తున్నారట.. రజినీకాంత్, కమల్ హాసన్ తరహాలోనే ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే తరహా యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమా చేసి కంబ్యాక్ కావాలని చూస్తున్నారని సినీవర్గాల సమాచారం.. ఈ మేరకే తాజాగా చిరంజీవికి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్టిల్స్ లో క్యూట్ లుక్ తో అధరగోడుతున్నారు చిరంజీవి.. యంగ్ హీరోల కంటే కూడా చిన్న వాడిలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు వారెవ్వా బాసూ.. పిచ్చ క్యూట్ గా ఉన్నావంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే కుర్రహీరోలంతా కుళ్లుకునేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు..