పంజాబ్ కేబినెట్ విస్తరణ.. కొత్తగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం

0
221

పంజాబ్‌ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కేబినెట్‌లో మరో ఐదుగురికి చోటు లభించింది. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం.

భగవంత్ మాన్ మంత్రివర్గంలో సునం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అమన్ అరోరా, అమృత్‌సర్ సౌత్ ఎమ్మెల్యే సింగ్ నిజ్జర్, ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్, గుర్‌ హర్‌ సాహీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఫౌజా సింగ్‌ సరారీ, సమానా నుంచి విజయం సాధించిన చేతన్‌ సింగ్‌ జౌరామజ్రా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనంతరం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 10 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా 5గురిని తీసుకోగా ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 15కు చేరింది. అన్మోల్‌ గగన్‌ మాన్‌ రెండో మహిళా మంత్రిగా నిలిచారు. మొదటి మహిళా మంత్రి బల్జిత్‌ కౌర్‌ ఉన్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకుగానూ.. 92 సీట్లను కైవసం చేసుకొని ఆప్‌ ప్రభుత్పాన్ని ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here