ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది, రికార్డు స్థాయిలో పెరిగిన ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలంటూ కాంగ్రెస్ క్యాడర్‌కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ఆందోళలనకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది. ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ కేడర్‌కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని సూచించింది. రాష్ట్రాల రాజధానుల్లో పీసీసీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడించనున్నారు. ఇక ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ సభ్యులు, జాతీయ నాయకులు పాల్గొంటారు.
రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. దేశ రాజధానిలో ఛలో రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.