కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు. భోపాల్ లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన ఆయన, పశువులలో వచ్చే లంపి-ప్రోవాక్ఇండ్కు స్వదేశీ వ్యాక్సిన్ను వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించబడిన ఐఐఎస్ఎఫ్ ‘‘ఫేస్-టు-ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్’’లో పాల్గొన్న ఆయన, మా కంపెనీ నాసల్ వ్యాక్సిన్ జనవరి 26న రిపబ్లిక్ డే రోజులన అధికారికంగా ప్రారంభించబడుతుందని వెల్లడించారు. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి ఒక్కో డోసుకు రూ. 325 ఛార్జ్ చేస్తుండగా.. ప్రైవేటు టీకా కేంద్రాలకు రూ. 800 చొప్పున విక్రయిస్తామని డిసెంబర్ లో వెల్లడించారు.