Train Fire Accident : రైలు భోగిలో నోట్ల కట్టలు.. పరారైన ఇద్దరు వ్యక్తులు

0
28

శనివారం తమిళనాడులోని మధురైలో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికి సుపరిచితమే.. లక్నో నుండి రామేశ్వరం వెళుతున్న రైలు లోని టూరిస్ట్ కోచ్ లో గ్యాస్ సిలిండర్ పేలింది.. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. కాగా ఈ దుర్ఘటన పై దర్యాప్తు చేపట్టారు అధికారులు.. ఈ నేపథ్యంలో తనికీలు నిర్వహించిన అధికారులకి ఒక పెట్టె దొరికింది.. వాళ్ళు దాన్ని తీసి చూడగా అందులో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.. అయితే అవి సగం కాలిపోయి ఉన్నాయి.. కాగా కట్టల్లో ఉన్న నోట్లన్నీ 500 మరియు 200 రూపాయల నోట్లు..

ప్రస్తుతం ఈ డబ్బు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది.. ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ పేలడమే అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.. కానీ ఇక్కడ మరో విషయాన్ని అధికారులు గుర్తించారు.. రైలు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు.. ఆ వ్యక్తులకి ఈ ప్రమాదానికి ఏమైనా సబ్బందం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. అయితే టూరిస్ట్ కోచ్ లోని మహిళ టీ పెట్టుకునేందుకు గ్యాస్ వెలిగించగా ఈ ప్రమాదం జరిగింది అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.. నిజంగ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ పేలడమేనా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.. పరారీలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు దిరికితేగాని ఈ ప్రమాదానికి అసలు కారణం తెలీదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here