Mumbai : ఎక్కడ చోటు లేనట్లు ప్యాంట్ లో పేట్టావేంట్రా.. ఇదెక్కడి కర్మరా బాబు..

0
27

ఎన్ని చర్యలు తీసుకున్న.. అక్రమదారులు వారి పంథా మార్చుకోవడం లేదు.. తాజాగా సుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ/ 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొదట కేరళ ప్రాంతానికి చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు.. ఇండిగో విమానంలో దుబాయ్‌ నుంచి ముంబైకి వస్తుండగా అనుమానం వచ్చి తనికీ చేసిన పోలీసులు అతని దగ్గర నుండి రూ. 54 లక్షల విలువైన మూడు బ్రాండెడ్‌ వాచీలు (రోలెక్స్‌, పటెక్‌ ఫిలిప్‌, బ్రెగ్యుట్‌)తో పాటు 10.80 గ్రాముల బరువున్న 18 క్యారెట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.. కొల్హాపూర్‌కు చెందిన మరో ప్రయాణికుడు 2,250 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారాన్ని రెండు పౌచ్‌లలో ఉంచి వాటిని అతని లోదుస్తుల లోపల దాయగా అతన్ని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు..
అలాగే దుబాయ్ నుంచి వస్తున్న రాయగఢ్, కేరళ, హర్యానాకు చెందిన మరో ముగ్గురు ప్రయాణికులను మరియు రియాద్ నుండి ప్రయాణిస్తున్న మరో ముగ్గురు ప్రయాణికులను అనుమానం వచ్చి తనిఖీ చేసిన పోలీసులకి అందరి దగ్గర నుండి కలిపి ౩.2 కోట్ల విలువైన బంగారం దొరికింది.. ఈ ప్రయాణికులు ప్యాంటు, షూలు, లోదుస్తులలో బంగారాన్ని దాచి బంగారాన్ని బండారు దాటించాలని చూడగా కస్టమ్స్ అధికారులు చాకచక్యంగ పట్టుకుని బంగారాన్ని, విలువైన గడియారాలని స్వాధీనం చేసుకున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here