అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దారుణం.. అల్లుడిని కొట్టిచంపిన అత్తమామలు

0
161

దేశంలో మరో పరువు హత్య జరిగింది. తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఓ దళిత యువకుడిని దారుణంగా కొట్టిచంపారు అత్తమామలు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కర్రలతో కొట్టి దారుణంగా యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు.. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నందుకు దళిత వ్యక్తిని.. యువతి తల్లిదండ్రులు హతమార్చారు. పనుఅదోఖాన్ గ్రామానికి చెందిన దళిత రాజకీయా కార్యకర్త జగదీష్ చంద్ర(39) శుక్రవారం భికాయసైన్ పట్టణంలో కారులో శవమై కనిపించాడు. అతని శరీరంపై మొత్తం 25 గాయాలు ఉన్నాయి… లాఠీల వంటి కర్రలను ఉపయోగించి దాడి చేసినట్లు తెలుస్తోంది.

జగదీష్ చంద్ర భార్య తల్లి, ఆమె సవతి తండ్రి, ఆమె సవతి సోదరుడు మృతదేహాన్ని పారేసేందుకు కారులో తీసుకెళ్తుండగా..పట్టుబడ్డారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హతుడు జగదీష్ చంద్ర ఆగస్టు 21న అగ్ర కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆగస్టు 27న తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత కోరుతూ దంపతులు పోలీసులు ఆశ్రయించారు. అయితే ఇదిలా ఉంటే అతని అత్తమామలు గురువాంర శిలాపాని బ్రిడ్జి వద్ద జగదీష్ చంద్రను కిడ్నాప్ చేశారు.. ఆ తరువాత తీవ్రంగా కొట్టి చంపారు. జగదీష్ చంద్ర 2021లో ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ అభ్యర్థిగా ఉప్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. దంపతులు ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని హతుని తరుపున వారు ఆరోపిస్తున్నారు. ఈ హత్య సిగ్గు చేటని.. బాధితురాలికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ నాయకుడు పిసి తివారీ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here