ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర కవితదే.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

0
121

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని కేంద్ర బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఇందులో సీఎం కేసీఆర్ కుటుంబం ఉందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి వచ్చేవారని..దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబంలోని పలువురు ఈ లిక్కర్ మాఫియాలో భాగస్వాములు ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. తెలంగాణలో కూడా ఇలాంటి మద్య విధానమే ఉందని.. పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారని.. ఎంపీ పర్వేజ్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎల్1 లైసెన్సు హోల్డర్లని ఆరోపించారు.

మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది కేసీఆర్ కూతురు కవితే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. రెడ్డి బ్రదర్స్ ను కూడా తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత ఢిల్లీకి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అన్నారు. ఆప్ పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో లిక్కర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని.. చద్ధా ఫ్యామిలీ నుంచి రూ. 4.5 కోట్లు ముట్టాయని ఆయన ఆరోపించారు. రూ. 3 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల క్రెడిట్ నోట్ తీసుకున్నారని అన్నారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here