boyapati srinu: ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్త.. బోయపాటి శ్రీను

0
30

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా స్కంద.. ఈ చిత్రంలో రామ్ సరసన సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల సందడి చేయనుంది.. కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్క మాస్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం.. వినాయక చవితి సందర్భగా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది..

దీనితో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది.. ఈ నేపథ్యంలో తాజాగా శిల్పకల వేదికలో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ ఈవెంట్ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రసింగించారు.. బోయపాటి శ్రీను మాట్లుడుతున్నప్పుడు అభిమానులంతా అఖండ 2 కావాలని అరుపులతో వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు..

దీనితో ఆ విషయంపైన స్పందించిన బోయపాటి శ్రీను మేము త్వరలోనే అఖండ 2 తో ముందుకు వస్తాం మాకు కాస్త టైం ఇవ్వండి అని అఖండ 2 గురించి హింట్ ఇచ్చారు.. తదనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బాలకృష్టకి నాకు 15 ఏళ్ళ అనుబంధం ఉంది.. అయితే ఆ అనుబంధంతో ఈ ప్రమోషన్ వేడుకకి రాలేదు కేవలం ఆయన మా సినిమా గురించి ఒక్క మాట చెప్తే మాకు మంచి జరుగుతుందనే నమ్మకం.. అందుకే ఈ ప్రీ రిలీస్ ఈవెంట్ కి బాలయ్యని ఆహ్వానించాం అన్నారు..

అనంతరం చిత్రం స్కంద గురించి మాట్లాడిన ఆయన.. అందరూ అనుకుంటున్నట్టు ఇది మాస్ మూవీ కాదని.. కుటుంబ కథ చిత్రం అని.. ఇందులో మాస్ ప్రేక్షకులకి కావాల్సిన యాక్షన్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.. ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ.. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరో తో చేస్తున్నావ్ అని అడుగుతారు కానీ శ్రీలీల ని ఏ హీరో తో చేయడం లేదు అని అడగాల్సిన పరిస్థితి.. ఇలానే ముందుకు దూసుకెళ్ళు కానీ ఎక్కువగా పరిగెత్తకు గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత అని శ్రీలీలని మృదువుగా హెచ్చరించారు బోయపాటి శ్రీను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here