డ్వాక్రా మహిళలకి డ్రోన్లు…మహిళల అభివృద్ధే ధ్యేయం…మోదీ…

0
44

ఎర్రకోటలో జరిగిన 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 1800 మంది సామాన్య ప్రజలను కేంద్రం ఆహ్వానించింది… ఆహ్వానితులందరు కుటుంబాలతో సహా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైయ్యారు… హాజరైన వారిలో 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పత్తి సంఘాల సభ్యులు, ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన నుంచి 50 మంది చొప్పున, 50 మంది ఉన్నారు.

ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలని పురస్కరించుకున్న ప్రధాని మోదీ ఆ తదన్తరం సుదీర్ఘ ప్రసంగం చేసారు… ఈ ప్రసంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతికతను గ్రామీణాభివృద్ధిలో వినియోగించే పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుపారు.. ఈ పథకం కింద వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి 15 వేల మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మహిళల అభివృద్ధే మా ద్యేయం అటువైపుగానే అడుగులు వేస్తున్నాం అని ప్రసంగించారు… ఈ పథకం ద్వారా గ్రామాల్లోని రెండు కోట్ల మంది అక్కచెల్లెళ్లను లక్షధికారులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు… స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ద్వారా డ్రోన్లను నిర్వహిస్తాం… ఇప్పటికే దేశంలోని 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు.. మనం మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్న గ్రామానికి వెళితే బ్యాంకుల్లో దీదీలు, అంగన్‌వాడీలు కనిపిస్తారు.. మందులను పంపిణీ చేసే సోదరిలు కనిపిస్తారు.. గ్రామాల్లో 2 కోట్ల మంది ఆడపడుచులను లక్షాధికారులుగా సృష్టించాలన్నది నా కల అని ఆ కలని సాకారం చేసుకునే దిశగా మా ప్రభుత్వం పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు…

డ్రోన్లని ఉపయోగించే విధానంతోపాటు మరమత్తులు చేసేలా మహిళలకి శిక్షణ ఇచ్చేల అగ్రిటెక్ పైన ద్రుష్టి పెట్టాము…దీనిద్వారా పురుగు మందులు, నేల, పంట పోషకాల పిచికారీలో డ్రోన్ల వినియోగంపై ఈ ఏప్రిల్‌లో ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీచేసింది. వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం డ్రోన్‌లను అందిస్తుంది. మన వ్యవసాయ పనుల కోసం డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు ప్రారంభిస్తాం అని మోదీ ప్రసంగించారు…

దేశ ప్రగతిలో మహిళాఅభివృధే ప్రధాన పాత్ర పోషిస్తుందని… ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పౌర విమానయాన రంగంలో అత్యధికంగా మహిళా పైలట్లు ఉన్నట్టయితే అది మన దేశమేనని భారత్ గర్వంగా చెప్పగలదు.. చంద్రయాన్ లేదా చంద్రుడిపై ఇతర ప్రయోగాల్లో చాలా మంది మహిళా శాస్త్రవేత్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు’ అని ఆయన మాట్లాడారు.

మరోవైపు, ‘నారీ సమ్మాన్’ గురించి మోదీ మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలో తనకి అనుభవమైన ఓ సంఘటన గురించి ప్రజలతో పంచుకున్నారు..నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఒక దేశం యొక్క సీనియర్ మంత్రి నన్ను ఇలా అడిగారు మీ దేశం లో మహిళలు సైన్స్, ఇంజనీరింగ్ చదువుతున్నారా? అని అడగగా నేను మా దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులను తీసుకుంటున్నారని మంత్రికి చెప్పాను . మన అమ్మాయిలు అత్యధికంగా ఈ కోర్సులు చదువుతున్నాని తెలిసి ఆయన (మంత్రి) ఆశ్చర్య పోయారు అని మోదీ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here