మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే

0
139

ఉద్ధవ్ పదవి నుంచి దిగిపోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం ఏక్ నాథ్ షిండే గోవా నుంచి ముంబయి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫడ్నవీస్‌ నివాసానికి వెళ్లారు. అనంతరం వీరిద్దరూ కలిసి రాజ్‌భవన్‌ను వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్ తో ముగిసిన భేటీ. దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండేకి స్వీట్స్ తినిపించారు గవర్నర్.

ఏక్ నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9 న జన్మించారు. ఆయనకు ఒక్కరే సంతానం కొడుకు పేరు శ్రీకాంత్ షిండే. ఆయన యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఏక్‌నాథ్‌ షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏక్‌నాథ్‌ షిండే ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడీ ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా పని చేశారు. శివ‌సేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్‌ అయ్యాడు. అసోంలో రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన క్యాంప్ నడిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here