ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ..

0
260

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, లాలూ ప్రసాద్ యాదవ్ ను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించారు. లాలూ.. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు భుజం విర‌గ‌డంతో బాధ ప‌డుతున్న లాలూను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. అయితే.. లాలూ ప్ర‌సాద్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయ‌న కుడి భుజం ఎముక విరిగింది. కాగా.. కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుప‌త్రిలో చేర్చించారు. అయితే..లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లిన‌ట్టు ఆయ‌న కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ తెలిపారు.

కాగా.. ఇప్పటికే తీవ్రమైన కిడ్నీ వ్యాధితో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ని ఎయిమ్స్‌లో చేర్చామ‌న్నారు. అయితే..ఇక్క‌డి వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారన్నారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామన్నారు. లాలూ పెద్దకుమర్తె మిసా భారతి లాలూతోనే ఉన్నారు. అయితే లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఈనేపథ్యంలో.. లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంద‌ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తెలిపిన ఆయన పట్నాలోని పరాస్ ఆసుప‌త్రికి వెళ్లి లాలూను ప‌రామ‌ర్శించి, లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here