మాజీ క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు గోవా ప్రభుత్వం నోటీసులు

0
30

భారత మాజీ క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసలు అందజేశారు. గోవాలోని మోర్జిమ్ లో యువరాజ్ సింగ్ కు ఓ విలాసవంతమైన భవంతి ఉంది. ఈ భవనం పేరు ‘కాసా సింగ్’. ఈ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని యువీ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇచ్చాడు. ఒక విధంగా ఇది పేయింగ్ గెస్ట్ విధానం కిందికి వస్తుంది. ఈ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి.

ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే, ఇంటిని పర్యాటకుల కోసం అద్దెకు ఇస్తామని యువరాజ్ సింగ్ ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు స్పందించాయి. టూరిజం శాఖ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అద్దెకు ఇస్తామని ప్రకటించడం నిబంధనలకు వ్యతిరేకం అని, అందుకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్టు గోవా టూరిజం శాఖ వెల్లడించింది. హోటల్ అయినా, గెస్ట్ హౌస్ అయినా, విల్లా అయినా ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గోవా సర్కారు స్పష్టం చేసింది. జారీ చేసిన నోటీసులకు డిసెంబరు 8వ తారీఖున స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని యువరాజ్ ను గోవా ప్రభుత్వం ఆదేశించింది.

Goa, Tourism Department, former cricketer, Yuvraj Singh, Tourist Trade Act, Varchawada, Morjim, Department of Tourism

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here