అత్యాచార బాధితురాలితో పెళ్లి.. 4 గంటల పెరోల్ పై వచ్చి జైలుకెళ్లిన వరుడు..

0
51

పెళ్లి కోసం ఏ నేరస్తుడికి 4 గంటల పర్మిషన్ ఇచ్చారు జైలు అధికారులు. మళ్లీ వివాహం తతంగం పూర్తయిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ ఘటన బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. అత్యాచార ఆరోపణలపై 20 రోజుల క్రితం జైలుకు వెళ్లిన యువకుడు, అత్యాచారానికి గురైన బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కోసం జైలు అధికారులు 4 గంటల పర్మిషన్ ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామ నివాసి అయిన రాహుల్ కుమార్ హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ ఓ సారి తన కుటుంబంతో కలసి లక్నోకు వెళ్లారు. ఆ సమయంలో యూపీ కప్తంగంజ్ కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో స్నేహం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారింది.

ఈ నేపథ్యంలో మార్చి 4న వీరిద్దరు గోపాల్ గంజ్ ఆలయానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి రాహుల్ కుమార్ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో యువతిని పరీక్షించిన వైద్యులు అత్యాచారానికి గురైనట్లు వెల్లడించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు రాహుల్ ను అరెస్ట్ చేశారు. తాను అత్యాచారం చేయలేదని ఇద్దరం ప్రేమించుకన్నామని నిందితుడు కోర్టుకు తెలిపాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్ పై వచ్చి బాధితురాలిని వివాహం చేసుకున్నాడు.

ఈ వివాహానికి అబ్బాయి, అమ్మాయి తరుపు బంధువులతో పాటు పోలీసులు హాజరయ్యారు. తావే దుర్గా ఆలయంలో ఈ జంట వివాహం చేసుకుంది. ఇప్పుడు వీలైనంత త్వరగా తమ న్యాయవాది ద్వారా కోర్టులో వివాహ ధృవీకరణ పత్రం అందించి, ఇద్దరూ వైవాహిక జీవితంలో జీవించేందుకు వీలుగా తమ కొడుకు రాహుల్‌కుమార్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తామని అబ్బాయి, అమ్మాయి బంధువులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here